అరకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారా.. మీకో శుభవార్త, రైల్వేశాఖ కీలక నిర్ణయం
Visakhapatnam To Araku Special Train From December 28th: అరకు వెళ్లే వారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఈ సీజన్‌లో అరకు వెళ్లే పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-అరకులోయ (08525) మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఈ విషయంపై వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు ఈ నెల 28 నుంచి జనవరి 19వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి 11.45 గంటలకు అరకులోయ చేరుతుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో 08526 నంబరుతో ఈ రైలు అదేరోజు మధ్యాహ్నం 2.00 గంటలకు అరకులోయలో బయలుదేరి సాయంత్రం 6.00 గంటలకు విశాఖ వస్తుంది.
---------------------------
హైలైట్:
అరకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త
విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా రైలు
ప్రతి శని, ఆదివారాల్లో అందుబాటులోకి
విశాఖపట్నం నుంచి అరకుకు రైలు
×
----------------------------
విశాఖపట్నం నుంచి అరకుకు రైలు
ఆంధ్రప్రదేశ్ ఊటీ అరకు వెళ్లే పర్యాటకులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఈ సీజన్‌లో అరకు పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం నుంచి అరకుకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు. తూర్పు కోస్తా రైల్వే ఈ స్పెషల్ రైలు (08525)ను నడుపుతున్నట్లు.. షెడ్యూల్‌ను వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.. అయితే ప్రతి శని, ఆదివారం మాత్రమే ఈ రైలు నడుస్తుంది.
-----------------------------
విశాఖపట్నం నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ఈ స్పెషల్ రైలు ఉదయం 8.30 గంటలకు బయలు దేరి ఉదయం 11.45 గంటలకు అరకు చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08526) మధ్యాహ్నం 2 గంటలకు అరకులో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలులో అందుబాటులో ఉండే కోచ్‌ల విషయానికి వస్తే.. ఒక సెకెండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ, 10 స్లీపర్ క్లాస్, 4 సాధారణ రెండో తరగతి, 2 సాధారణ కమ్ లగేజీ కోచ్‌లు ఉంటాయి. ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా గుహలు మీదుగా వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు. అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్న పర్యాటకులు గమనించి ఈ రైలు సేవలు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
🙏PLZ SUBSCRIB🙏
Full Project
Xml
Song


0 Comments:
إرسال تعليق
Hii