new trending vadi-vadiga viral lyrical video insta Reel144


 







ISRO: ఇస్రో సిగలో మరో రికార్డ్‌.. నింగిలో దూసుకెళ్లిన GSLV-F15.. 100వ రాకెట్‌తో సక్సెస్‌

ISRO: నావిక్‌ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికాకు చెందిన జీపీఎస్‌కు ఇది ప్రత్యామ్నాయం. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవలను అందించడం దీని ఉద్దేశం..

ISRO: ఇస్రో సిగలో మరో రికార్డ్‌.. నింగిలో దూసుకెళ్లిన GSLV-F15.. 100వ రాకెట్‌తో సక్సెస్‌


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనేక విజయాలు సాధిస్తోంది. ఇప్పుడు సరికొత్త రికార్డు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేసిన ఇస్రో.. తన 100వ రాకెట్‌ను ప్రయోగించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఇస్రో. బుధవారం నెల్లూరులోని శ్రీహరి కోట నుంచి ఉదయం 6.23 గంటలకు GSLV-F15ని నింగిలోకి ప్రయోగించి రికార్డ్‌ సృష్టించింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.


ISRO అంతరిక్ష పరిశోధనా కేంద్రం భారతదేశం గర్వించదగిన వాటిలో ఒకటి. ప్రపంచ దేశాలు పోటీ పడి అంతరిక్ష పరిశోధనలు చేస్తుండగా.. ఇస్రో కూడా వాటికి సమాంతరంగా ఎన్నో అధ్యయనాలు చేపడుతోంది. చంద్రయాన్, మంగళయాన్‌తో సహా ప్రత్యేక ప్రాజెక్టుల ద్వారా ఇస్రో భారతదేశాన్ని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసింది. ఈ దశలో భారత్ తన 100వ రాకెట్‌ను ప్రయోగించి మరో చారిత్రక కీర్తిని అందుకుంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్‌ నారాయణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. నారాయణన్‌ ఛైర్మన్ అయిన తర్వాత తొలి ప్రయోగం ఇది.


నావిక్‌ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికాకు చెందిన జీపీఎస్‌కు ఇది ప్రత్యామ్నాయం. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవలను అందించడం దీని ఉద్దేశం. కొత్త శాటిలైట్‌తో దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ మరింత విస్తృతం కానున్నది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని శాటిలైట్‌ సెంటర్‌లో రూపొందించగా.. ఇతర శాటిలైట్‌ సెంటర్లు సహకారం అందించాయి.


Gslv F15


నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (NavIC) అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఇది భారతీయ వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం (PVT) సేవలను అందించడానికి రూపొందించబడింది. ఈ సేవల కొనసాగింపును నిర్ధారించడానికి NVS-01/02/03/04/05 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో.


NVS-02 ఈ NVS సిరీస్‌లో రెండవ ఉపగ్రహం. దీని బరువు 2250 కిలోలు, పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ 3 kW. ఖచ్చితమైన సమయ అంచనాను నిర్ధారించడానికి, NVS-02 స్వదేశీ, దిగుమతి చేసుకున్న రుబిడియం అటామిక్ గడియారాలతో అమర్చారు శాస్త్రవేత్తలు. దీని జీవితకాలం దాదాపు 12 సంవత్సరాలు.


 

FULL PROJECT 

DOWNLOAD


DOWNLOAD



XML



DOWNLOAD





SONG



DOWNLOAD

0 Comments:

Post a Comment

Hii